![]() |
![]() |
.webp)
పట్టపగలు.. నడి రోడ్డు మీద కిడ్నాప్ చేస్తేనే దిక్కులేదు. అలాంటిది నైట్ టైమ్ ఒంటరిగా తిరిగితే కిడ్నాప్ చేయరా.. బిగ్ బాస్ హౌస్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా అడుగుపెట్టిన టేస్టీ తేజ కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ ఎవరు చేశారు? ఎందుకు చేశారో ఓసారి చూసేద్దాం...
రెండు రోజుల క్రితం టేస్టీ తేజ గురించి అమర్ దీప్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. అదేంటంటే నేను మా ఇంటికి రమ్మంటే రావు గానీ శుభశ్రీ రమ్మంటే షాపింగ్ కి వెళ్తావా అని ఓ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిన షాపింగ్ వీడియోకి అతడిని ట్యాగ్ చేసి అన్నాడు. ఇక తాజాగా టేస్టో తేజని తన కార్ లో తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను వదిలేయ్ రా అంటు టేస్టీ తేజ అరిచేశాడు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ రా అని అడిగిన అమర్ చెప్పలేదు. టేస్టీ తేజ, అమర్ దీప్ ఇద్దరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మంచి స్నేహితులుగా ఉన్నారు. హౌస్ లో ఎక్కువ సార్లు వీరిద్దరి మధ్య బాండింగ్ ఉండేది. అందుకే బయటకొచ్చాక కూడా ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లతో ఎక్కువగా వ్లాగ్స్ చేస్తున్నాడు టేస్టీ తేజ.
ఫైనల్ గా ఓ రెస్టారెంట్ టేస్టీ తేజని తీసుకెళ్ళి కడుపునిండా భోజనం పెట్టించాడు అమర్ దీప్. తీసుకొస్తే తీసుకొచ్చావ్ గానీ కమ్మని భోజనం పెట్టావ్ రా అని టేస్టీ తేజ అన్నాడు. ఇంతకీ ఈ హోటల్ పేరెంట్రా అని తేజ అనగా.. రా తిను అని అమర్ అంటాడు .. తిన్నా గనీ చెప్పరా అని తేజ అనగా.. రెస్టారెంట్ పేరే రా తిను అని అమర్ అన్నాడు. ఓరీనీ అవునా.. కబాబ్స్,కుక్కర్ రైస్ పులావ్ అన్నీ బాగున్నాయ్ అంటు తేజ అన్నాడు. ఇలా ఇద్దరు కాసేపు మాట్లాడుకొని వారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ బాండింగ్ ని కొనసాగించారు.
![]() |
![]() |